ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆగస్టు 15న జన్మిస్తే...

tsrtc
ఈ నెల 15వ తేదీన 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకోసం దేశం యావత్తూ సిద్ధమవుతుంది. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఆగస్టు 15వ తేదీన జన్మించే శిశువులకు వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రకటించారు. 
 
అలాగే, 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ నెల 21 వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. 75 ఏళ్లు పైబడినవారికి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి 75 శాతం రాయితీపై మందులు అందించనున్నట్లు తెలిపారు.