శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 సెప్టెంబరు 2021 (17:27 IST)

కన్సాలిడేటెడ్‌ జెఈఈ మెయిన్‌ 2021 ఫలితాలు: 99% పైగా మార్కులు సాధించిన ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు

ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ -తెలంగాణాకు చెందిన 12 మంది విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకమైన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఈఈ) మెయిన్‌ 2021 వద్ద అత్యంత ఆకర్షణీయంగా 99 పర్సంటైల్‌‌కు పైగా సాధించారు. ఈ పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులలో శ్రీనికేతన్‌ జోషి (99.99%), గౌతమ్‌సింగ్‌ (99.96%), అన్మోల్‌ కురోథ్‌ (99.87%), మొహమ్మద్‌ అరీబుస్సేన్‌ (99.84%) మరియు కె ఎస్‌ మకరంద్‌ (99.76%) ఉన్నారు.
 
ఈ విద్యార్థులు ఐఐటీ జెఈఈలో ప్రవేశం పొందేందుకు ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌లో  చేరారు. తమ అభ్యాస షెడ్యూల్స్‌కు పూర్తిగా కట్టుబడి ఉండటం, కాన్సెప్ట్‌లను పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా వారు టాప్‌ పర్సంటైల్‌ జాబితాలో చేరగలిగారు. తమకు ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ అందించిన సహకారం కారణంగానే ఈ పర్సంటైల్‌ సాధించామని విద్యార్థులు వెల్లడిచేస్తూ అతి తక్కువ సమయంలో విభిన్నమైన బోధనాంశాలకు సంబంధించి ఎన్నో అంశాలను సమగ్రంగా తెలుసుకోగలిగామన్నారు.
 
విద్యార్థులను అభినందించిన ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌  ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ, ‘‘తెలంగాణా నుంచి ఈ అసాధారణ ఫీట్‌ను సాధించిన 12 మంది విద్యార్థులను అభినందిస్తున్నాను. దేశ వ్యాప్తంగా జెఈఈ మెయిన్‌ 2021 నాలుగు సెషన్‌ల కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ టాప్‌ పర్సంటైల్‌ మార్కులు సాధించడమన్నది విద్యార్థుల కష్టం, అంకిత భావంతో పాటుగా వారి తల్లిదండ్రుల మద్దతు గురించి ఎంతో చెబుతుంది. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు
 
ఆయనే మాట్లాడుతూ, ‘‘మహమ్మారి అనంతర కాలంలో విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్‌ సాధించడానికి తాము మరిన్ని వినూత్న కార్యక్రమాలను ప్రారంభించాము. డిజిటల్‌‌గా విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటంతో పాటుగా స్టడీ మెటీరియల్‌, క్వశ్చన్‌ బ్యాంక్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. పలు వర్ట్యువల్‌ సదస్సులు, పరీక్షలను గురించి సెమినార్లు నిర్వహించడం, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను తెలుపడం ద్వారా  విద్యార్థులకు తగు రీతిలో సహాయపడ్డాం. మా ప్రయత్నాలు ఇప్పుడు అపూర్వ ఫలితాలను సాధించడం పట్ల  సంతోషంగా ఉన్నాం’’ అని అన్నారు.