తెలంగాణ మరో రెండు రోజుల్లో వర్షాలు.. ఎల్లో అలెర్ట్
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తిరోగమనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇందులో భాగంగా శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి-ఖమ్మంగూడెంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వరంగల్, హన్మకొండ ప్రాంతాలు, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.