సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (09:45 IST)

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్

transgender
తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం కోసం ప్రచారకర్తగా ఓ ట్రాన్స్‌జెండర్‌ను నియమించారు. ఈ విధంగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నికల కమిషన్‌ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. పేరున్న నటులు, సెలబ్రిటీలు, సామాజిక వేత్తలను ప్రచారకర్తలుగా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తుంది. 
 
ఈ క్రమలో ఈ దఫా వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ లైలాను ఎంపిక చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్‌జెండర్లుకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వారంలో ఒక రోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేయించారు.