శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:25 IST)

గ్రూప్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ..వివరాలివే

students
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. కోచింగ్ సెంటర్లు భారీగా ఫీజులు వసూలు చేస్తుండడమే ఇందుకు కారణం.  
 
నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ ఉద్యోగాల‌కు ఎస్సీ అభ్య‌ర్థుల కోసం ఫౌండేష‌న్ కోర్సు కింద 45 రోజుల నుంచి 60 రోజుల స్వ‌ల్ప కాలిక శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు ఎస్సీ స్ట‌డీ స‌ర్కిల్ డైరెక్ట‌ర్ వేణుగోపాల్ తెలిపారు. 
 
ప్ర‌తీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే ఒక్కో సెంట‌ర్‌లో 75-150 మందికి కొచింగ్ ఇస్తామ‌ని ప్రకటించారు. తెలంగాణకు చెందిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ప్ర‌తీ జిల్లా కేంద్రంలో కోచింగ్ ఉంటుంది. ప్ర‌తీ కేంద్రంలో 75 నుంచి 150 మందికి కోచింగ్ అందిస్తారు. ఎస్సీ అభ్యర్థులకే ఈ ఉచిత కోచింగ్ ఇవ్వబడుతోంది. అడ్మిషన్లు  ఏప్రిల్ 22న జరుగుతాయి. అలాగే ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం అవుతాయి.