ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (11:13 IST)

తెలంగాణాలో నేడు రేపు వర్షాలు

Rain
తెలంగాణా రాష్ట్రంలో ఓ విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనివున్నాయి. ఒకవైపు పలు ప్రాంతాల్లో పగటి పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేడు, రేపు రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కూడా హైదరాబాద్ నగరంలో వర్షం పడింది. 

 
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్నాటక వరకు 900 మీటర్ల ఎత్తున గాలులు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలోని చాప్రాలలో ఆదివారం గరిష్టంగా 43.9 డిగ్రీల పగటిపూట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అధికం కావడం గమనార్హం.