మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 22 నవంబరు 2018 (20:43 IST)

భర్త ప్రియురాలితో ఏకాంతంగా ఉండడాన్ని చూసిన భార్య... ఏం చేసిందంటే..!

అన్యోన్యమైన దాంపత్యం వారిది. ఇలాంటి భార్యాభర్తలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండరు అని అనుకున్నవారు లేకపోలేదు. అలాంటి కుటుంబంలో ఒక్కసారిగా అలజడి. హైదరాబాదులో జరిగిన సంఘటన ఇది.
 
నాంపల్లి ఏరియా మున్సిపల్ పార్కుకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో అరుపులు. యువతిని ఎవరో హత్య చేశారంటూ ఇంటి యజమాని అరుపులు. దీంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి హత్య కాబడిన ప్రాంతంలో ఒక ఐడి కార్డును గుర్తించారు. గుర్తింపు కార్డులో ఉన్న వ్యక్తి పేరు ప్రదీప్. అదే ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను. ప్రదీప్‌ను పోలీస్టేషనుకు తీసుకెళ్ళి విచారించడం ప్రారంభించారు పోలీసులు.
 
యువతి పేరు శ్వేత అని గుర్తించారు పోలీసులు. శ్వేత ఎవరో ముందు తెలియదని పోలీసుల విచారణలో చెప్పిన ప్రదీప్ ఆ తరువాత నిజం ఒప్పుకున్నాడు. ఆమె నా ప్రియురాలు అంటూ ఒప్పుకున్నాడు. అయితే ఆమెను చంపాల్సిన అవసరం తనకు లేదని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో వేలిముద్రలను పరిశీలించారు పోలీసులు. శ్వేతను గొంతు నులిమి చంపిన వ్యక్తి ప్రదీప్ కాదని నిర్థారణకు వచ్చారు. ఈ విచారణ జరుగుతుండగానే ప్రదీప్ భార్య అతనికి ఫోన్ చేసింది. పోలీసులు ఫోన్లో నీ భర్తను విచారిస్తున్నామని చెప్పారు. దీంతో ఆమె స్టేషనుకు చేరుకుంది.
 
శ్వేత హత్యకు తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది లత. అయితే పోలీసులు నమ్మలేదు. భర్తను కాపాడుకునేందుకు అలా చెబుతున్నావని, పోలీసుల దగ్గర పరాచకాలు వద్దన్నారు. అయితే జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది లత. తన భర్త తనను వివాహం చేసుకోక ముందే శ్వేత అనే యువతితో పరిచయం ఉందని తెలుసుకుంది. ఒకరోజు భర్తను ఫాలో అయి వెళుతుంటే తన భర్త, శ్వేత ఇద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని చూశాను. అందుకే కోపంతో ఆమెను హత్య చేశానని చెప్పింది లత. లత మాటలు విన్న భర్త ఆశ్చర్యపోయాడు. అన్యోన్యంగా ఉన్న వీరి జీవితం అక్రమసంబంధంతో చెల్లాచెదురుగా మారిపోయిందంటూ స్థానికులు అనుకుంటున్నారు.