శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (09:48 IST)

తాగుబోతు భర్త పోరుపడలేక కుమార్తెతో కలిసి....

తాగుబోతు భర్త పోరు పడలేక, వేధింపులు తాళలేక తన ఏడేళ్ల కుమార్తెతో కలసి కనిపించకుండా పోయింది ఓ ఇల్లాలు. పంజాగుట్ట ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఫతేనగర్‌లో రమాదేవిక, ఆమె భర్త మహేష్ ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. మహేష్ నిత్యం మద్యం తాగి తరుచూ భార్

తాగుబోతు భర్త  పోరు పడలేక, వేధింపులు తాళలేక తన ఏడేళ్ల కుమార్తెతో కలసి కనిపించకుండా పోయింది ఓ ఇల్లాలు. పంజాగుట్ట ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఫతేనగర్‌లో రమాదేవిక, ఆమె భర్త మహేష్ ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. మహేష్ నిత్యం మద్యం తాగి తరుచూ భార్య రమాదేవికతో గొడవ పడేవాడు. 
 
ఇంటి యజమాని వీరి గొడవలు చూసి ఇల్లు ఖాలీ చేయమని చెప్పాడు. దీంతో ఈ నెల 24న రమాదేవిక మహేష్‌తో కలిసి ఆటోలో సామాగ్రి తీసుకుని బడంగ్‌పేట్ లోని పుట్టింటికి బయలుదేరింది. ఆటోలో రమాదేవిక తన కుమార్తెను తీసుకుని వెళ్లగా మహేష్ తన బైక్ మీద వెళ్లాడు. రమాదేవిక మార్గం మధ్యలో ఆటో దిగి వెనుకు బస్సులో వస్తానని డ్రైవర్‌కు చెప్పి కనిపించకుండా పోయింది. 
 
ఆటో డ్రైవర్‌కు ఇల్లు దొరక్కపోవడంతో మహేష్‌కు జరిగిన విషయం చెప్పాడు. ఎంతకూ ఆమె ఆచూకీ దొరకకపోవడంతో బుధవారం అర్ధరాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహేష్. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. రమాదేవిక ఏమై ఉంటుందో అని కుటంబసభ్యులు కంగారు పడుతున్నారు.