గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (10:38 IST)

2023 ఎన్నికల్లో 95-105 సీట్లు గెలుస్తాం : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ 95 నుంచి 105 సీట్లు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జోస్యం చెప్పారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుకొస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ స్పందించారు.
 
అన్న ప్రశ్నకు కేసీఆర్ స్పందిస్తూ, దానిపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల్లో తెరాస 95 నుంచి 105 సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని మరో ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు.