1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (18:50 IST)

ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల.. విలీనం తప్పదా?

sharmila ys
తెలంగాణ రాష్ట్ర వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ వై.ఎస్. ఆర్ పార్టీని విలీనం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్‌కు కూడా సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను కూడా కలుసుకుని మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమె ఆకస్మికంగా ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. 
 
దాదాపు గంటపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో వైఎస్ షర్మిల తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా? లేక కాంగ్రెస్‌లో చేరుతారా? అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది.
 
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాను షర్మిల కలిశారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.