సన్నబడింది.. గ్లామర్ పెరిగింది.. బిజీ బిజీ అయిన సీతమ్మ
హీరోయిన్ అంజలి ప్రస్తుతం టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత ఆమెకు అవకాశాలు తరిగిపోవడంతో ఆమె కెరీర్ ఎండింగ్‌కు వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ప్రస్తుతం బిజీగా మారిపోయింది.
ఈ 36 ఏళ్ల బ్యూటీ ఇటీవల బాగా సన్నబడింది. స్లిమ్‌గా మారడంతో పాటు గ్లామర్‌గా, యంగ్‌గా కనిపించడంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమెకు అవకాశాలు పెరిగాయి. నేచురల్ యాక్టింగ్ చేసే అంజలి.. ప్రస్తుతం హైదరాబాదుకు మకాం మార్చింది.
ప్రస్తుతం రామ్‌చరణ్- శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో అంజలి రెండో హీరోయిన్. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే, విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రంలో కూడా అంజలి కీలక పాత్ర పోషిస్తోంది.
అంజలి హీరోయిన్‌గా ఇప్పటివరకు 49 సినిమాలు చేయగా ఆమె 50వ చిత్రం తమిళంలో ప్రారంభమైంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈగై అనే టైటిల్ గల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.