గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 4 మార్చి 2020 (21:33 IST)

క్రెడిట్ అంతా దిల్ రాజుకే వెళ్తుందని ఫీలవుతున్నాడట, అందుకే అలా చేస్తున్నాడట

ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన విభిన్న కథలతో వరుసగా సినిమాలు చేస్తూ, సక్సెస్ సాధిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే.. ఖచ్చితంగా ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. సినిమా బాగుంటుంది అనేంత పేరు సంపాదించుకున్నారు. 
 
ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారులోకం, జోష్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్... ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించారు. విక్టరీ వెంకటేష్ - సూపర్ స్టార్ మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు భారీ మల్టీస్టారర్ నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సంచలన విజయాన్ని అందించింది. రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాని నిర్మించి సంచలన విజయం సాధించారు. 
 
అయితే... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఇంతగా సక్సెస్ అవ్వడానికి దిల్ రాజుతో పాటు శిరీష్ లక్ష్మణ్‌ కూడా కారణం. ఈ ముగ్గురు కలిసి దాదాపు 20 ఏళ్ల నుంచి ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురిలో లక్ష్మణ్ బయటకు వచ్చి సొంతంగా నిర్మాణ సంస్థ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడట.

కారణం ఏంటంటే.. ఎంత కష్టపడినా క్రెడిట్ అంతా దిల్ రాజుకే వస్తుంది కానీ.. తనకు రావడం లేదని లక్ష్మణ్ బాగా ఫీలవుతున్నాడట. అందుకే దిల్ రాజు నుంచి విడిపోయి సొంతంగా నిర్మాణ సంస్థ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఆ వైపుగా అడుగులు వేస్తున్నాడట. త్వరలోనే నిర్మాణ సంస్థ పేరు ఎనౌన్స్ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.