ఎన్టీఆర్‌తో అనుకున్న త్రివిక్రమ్ చిన్న సినిమా చేస్తున్నాడా..?

trivikram srinivas
శ్రీ| Last Modified గురువారం, 24 సెప్టెంబరు 2020 (14:06 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నారు. ఎన్టీఆర్‌కు కథ చెప్పడం.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ క్రేజీ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సమ్మర్‌లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు.

అంతేనా.. ఈ సినిమాకి అయిననూ పోయిరావలే.. హస్తినకు అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే... కరోనా రావడంతో సమ్మర్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలి అనుకున్న మూవీ ఆగింది. ఆర్ఆర్ఆర్ పూర్తైన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్ చేస్తారు. ఆర్ఆర్ఆర్ పూర్తి అవ్వడానికి టైమ్ పడుతుంది.

అందుచేత ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ మరో సినిమా చేయాలి అనుకుంటున్నారు. మహేష్ బాబుతో సినిమా చేద్దామనుకున్నారు కానీ.. ఇప్పట్లో కుదరదు. కనుక నేచురల్ స్టార్ నానితో చిన్న సినిమా చేయాలి అనుకుంటున్నారట. మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేస్తానని నానికి చెప్పారట. ఇప్పుడు ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తుంది. మరి.. ఇది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.దీనిపై మరింత చదవండి :