'యంగ్ టైగర్' సరసన 'అతిలోక సుందరి' కుమార్తె?? (video)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో చిత్రంరానుంది. గతంలో వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు మరోమారు ఈ కాంబో రిపీట్ కానుంది. ఇందుకోసం దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో నిమగ్నమైవున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది. ఈ చిత్రం కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత యంగ్ టైగర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలసి పనిచేయనున్నాడు.
అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ నటి నటిస్తుందనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో సాగుతోంది. ఆ బాలీవుడ్ నటి ఎవరో కాదు.. సినీ అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఇప్పటికే జాహ్నవి కపూర్‌ని సంప్రదించడం జరిగిందనే వార్తలు తాజాగా టాలీవుడ్‌లో హైలెట్ అవుతున్నాయి. అయితే చిత్రయూనిట్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు.
అలాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని, దాని కోసం తెలుగు హీరోయిన్‌ని తీసుకోవాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రానికి "అయినా పోయిరావలే హస్తినకు" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చిత్ర యూనిట్ స్పందిస్తేనే ఈ అంశాలపై ఓ క్లారిటీ రానుంది.