శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (14:23 IST)

చిరుకు హీరోయిన్ కష్టాలు : ప్రాధాన్యతలేని పాత్ర.. ఆచార్య నుంచి కాజల్ ఔట్??

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఒకపుడు ఆయన సరసన నటించేందుకు హీరోయిన్లు క్యూ కట్టేవారు. కానీ, ఇపుడు ఆయన సరసన నటించేందుకు హీరోయిన్లు ముఖం చాటేస్తున్నారు. మొన్నటికి మొన్న త్రిష షాకివ్వగా.. ఇపుడు కాజల్ అగర్వాల్ మెగా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 
 
క్రియేటివ్ దర్శకుడు కొరటాల శివ - చిరంజీవి కాంబినేషన్‌లో "ఆచార్య" పేరుతో మూవీ నిర్మితమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడింది. ఇప్పటికే సింహ భాగం షూటింగ్ పూర్తయింది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత త్రిషను ఎంపిక చేశారు. కానీ, ఆమెకు చిత్ర యూనిట్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కాజల్ ధృవీకరించింది కూడా.
 
తదుపరి షెడ్యూల్లో ఆమె జాయిన్ అవుతుందని అన్నారు. కానీ ఆమె కూడా ఈ ప్రాజెకు నుంచి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్‌తో జోడి కట్టేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఇందుకుగాను ఆమె బల్క్ గా డేట్స్ ఇచ్చిందనీ, భారీ పారితోషికమే అందుకుందని అంటున్నారు. డేట్స్ సర్దుబాటు కానీ కారణంగానే తను 'ఆచార్య' చేయలేకపోతున్నట్టు చెప్పిందట. 'ఆచార్య' సినిమాలో తన పాత్రకి ఏ మాత్రం ప్రాధాన్యత లేని కారణంగానే ఆమె తప్పుకుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి.