సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Mohan
Last Modified: గురువారం, 28 జూన్ 2018 (17:11 IST)

రాజమౌళి సినిమాలో నటించబోతున్న 'మహానటి' కీర్తి సురేష్

రాజమౌళి అనగానే అతడు తీసిన బాహుబలి సినిమా అందరికీ గుర్తుకొస్తుంది. మరోప్రక్క మహానటి అంటే ఇప్పటివరకు సావిత్రి అనే వారు కానీ తాజాగా మహానటి సినిమాలో నటించిన కీర్తి కూడా ఆ పేరుకు తగ్గట్టు నటించి అందరి మన్నలను అందుకుంది. ఇప్పుడు రాజమౌళి ఎన్టీయార్, రామ్‌చరణ

రాజమౌళి అనగానే అతడు తీసిన బాహుబలి సినిమా అందరికీ గుర్తుకొస్తుంది. మరోప్రక్క మహానటి అంటే ఇప్పటివరకు సావిత్రి అనే వారు కానీ తాజాగా మహానటి సినిమాలో నటించిన కీర్తి కూడా ఆ పేరుకు తగ్గట్టు నటించి అందరి మన్నలను అందుకుంది. ఇప్పుడు రాజమౌళి ఎన్టీయార్, రామ్‌చరణ్ కాంబోలో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 
 
ఆ చిత్రం నవంబర్ నుండి రెగ్యూలర్‌గా చిత్రీకరణ జరుపుకోబోతోంది. ఇందులో కీర్తి సురేష్ ఒక కథానాయకగా ఎంపికైంది. ఈ విషయాన్ని జక్కన్నే స్వయంగా కీర్తికి ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. మహానటి సినిమా తర్వాత తెలుగులో ఖాళీగా ఉన్న కీర్తి ఈ సినిమాలో నటించడానికి సుముఖత వ్యక్తం చేసిందట. 
 
జూనియర్ ఎన్టీయార్ ప్రస్తుతానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవ సినిమాలో నటిస్తున్నాడు. ఆ చిత్రం దసరాకు విడుదల కానుంది. మరోపక్క రామ్‌చరణ్ రంగస్థలం వంటి హిట్‌తో మంచి జోరుమీదున్నాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరి చిత్రాల చిత్రీకరణ ముగిసిన తర్వాత రాజమౌళితో సినిమా ప్రారంభం కానుంది. ఎన్టీయార్, రామ్‌చరణ్‌లలో ఎవరి సరసన కీర్తి ఆడిపాడబోతోందో జక్కన్నే చెప్పాలి. మరొక హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రంతో టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయంటూ ఇద్దరి హీరోల అభిమానులు ఎదురుచూస్తున్నారు.