శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (17:20 IST)

మెగా హీరోలపై గీతా ఆర్ట్స్ క్రేజీ ప్రాజెక్టులు..

గీతా ఆర్ట్స్ పతాకంపై ప్రస్తుతం గీత గోవిందం సినిమా రూపుదిద్దుకోనుంది. త్వరలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ పతాకంపై మెగా హీరోలపై సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముగ్గురు మెగా హీరోల‌తో

గీతా ఆర్ట్స్ పతాకంపై ప్రస్తుతం గీత గోవిందం సినిమా రూపుదిద్దుకోనుంది. త్వరలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ పతాకంపై మెగా హీరోలపై సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముగ్గురు మెగా హీరోల‌తో మూడు డిఫరెంట్ ప్రాజెక్టులు చేయ‌నున్న‌ట్టు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ హీరోలుగా అల్లు అరవింద్ క్రేజీ ప్రాజెక్టులు చేయనున్నారు. 
 
వీరిలో చిరంజీవి సినిమా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్ సినిమాల‌కి సంబంధించిన క్లారిటీ రావ‌ల‌సి ఉంది. చిరు ప్ర‌స్తుతం సైరా సినిమాతో బిజీగా ఉండ‌గా, వ‌రుణ్ తేజ్ ఎఫ్‌2 చిత్రంతో పాటు సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ డైరక్టర్ ఎవరో తెలియాల్సి వుంది.