శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (20:29 IST)

ఎన్టీఆర్‌కు చెప్పకుండానే 'అర‌వింద స‌మేత' సినిమా రిలీజ్ డేట్ ఫిక్సా?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం అర‌వింద స‌మేత‌. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్‌కి

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం అర‌వింద స‌మేత‌. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్‌కి కొడుకు పుట్ట‌డంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చాడ‌ట‌. మ‌రో మూడు రోజుల్లో ఎన్టీఆర్ షూటింగ్‌కి హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే... ఈ చిత్రాన్ని ద‌స‌రాకి రిలీజ్ చేయనున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు. 
 
తాజా స‌మాచారం ఏంటంటే.... అక్టోబ‌ర్ 10న ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అయితే... ఇంకా ఎన్టీఆర్‌తో చెప్ప‌లేద‌ట‌. ఎన్టీఆర్‌తో చెప్పిన త‌ర్వాత అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది. అక్టోబ‌ర్ 10 బుధ‌వారం వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆరోజే రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల మ‌హాన‌టి సినిమా కూడా బుధ‌వారం రిలీజ్ అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 40 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్. థమ‌న్ సంగీతం అందిస్తున్నారు.