శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (11:22 IST)

అనూప్ రూబెన్స్‌కి లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చిన 'కాటమరాయుడు'?

హీరో పవన్‌ కళ్యాణ్‌కు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తాడనీ, దగ్గరకు చేరదీస్తారనీ, అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తాడనే మంచి పేరుంది. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి. అలాంటి 'కాటమరాయ

హీరో పవన్‌ కళ్యాణ్‌కు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తాడనీ, దగ్గరకు చేరదీస్తారనీ, అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తాడనే మంచి పేరుంది. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి. అలాంటి 'కాటమరాయుడు'కి కోపమెచ్చింది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌కి లెఫ్ట్ రైటూ ఇచ్చేశాడని పుకార్లు వినిపిస్తున్నాయి. 
 
పవన్ కళ్యాణ్ హీరోగా, డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పవన్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దీంతో.. జెడ్ స్పీడ్‌ వేగంతో షూటింగ్ కొనసాగిస్తున్నారు. 
 
షెడ్యూల్ ప్రకారం "కాటమరాయుడు" ఈ నెలాఖరులోగా షూటింగ్ పూర్తికావాల్సి వుంది. అయితే, మరో నెలరోజులు ఆలస్యం కానుంది. ఈ ఆలస్యానికి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కారణంగా తెలుస్తోంది. ఆయన 'కాటమరాయుడు'కి పాటలు అందివ్వడంలో ఆలస్యం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒకట్రెండు సార్లు హెచ్చరించారట.
 
అయినా ఇంకా పూర్తి చేయకపోవడంతో.. స్వయంగా పవన్ రంగంలోకి దిగి అనూప్‌ని కోప్పడినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. 'గోపాల గోపాల' సమయంలో అనూప్‌కి మరో అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం 'కాటమరాయుడు' చిత్రానికి అనూప్‌ని తీసుకొన్నాడు. అయితే, ఇటీవల కాలంలో అనూప్ ఫుల్ బిజీ కావడంతో.. కాటమరాయుడు పాటలు అందించడంలో కాస్త లేటయినట్టు తెలుస్తోంది.