గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (19:42 IST)

పాయల్‌పై మనసుపడిన లెక్కల మాస్టారు : ''పుష్ప''లో ఐటమ్ గర్ల్ (Video)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం పుష్ప. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటీనటుల ఎంపికపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా, సుకుమార్ చిత్రమంటేనే ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. 
 
ఈ ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతుల్లాకు ఛాన్స్ దక్కినట్టు తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదే పాత్ర కోసం మరో ఇద్దరు బాలీవుడ్ భామల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్‌కు బాలీవుడ్ భామలు కాకుండా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు పొందుతున్న నటి పేరు వినబడుతుంది.
 
'ఆర్ఎక్స్ 100' చిత్రంలో అందరి మనసులను దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సెలక్ట్ అయినట్లుగా టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈమె ఆ మధ్య బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది కూడా. 
 
ఆ తర్వాత సరైన పాత్రల కోసం వేచి చూస్తున్న పాయల్‌కు ఈ ఐటమ్ అవకాశం రావడం నిజంగా వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకోబోతున్న చిత్రం కాబట్టి.. ఆమె చేస్తున్న సాంగ్ క్లిక్ అయితే.. ఆమె దశ తిరిగినట్లే.. అంటూ అప్పుడే వార్తలు మొదలయ్యాయి. అయితే ఈ విషయమే చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.