బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (20:14 IST)

సర్.. నేను ఆ క్యారెక్టర్‌కు సరిపోతానా? శేఖర్ కమ్ములతో ప్రభాస్...

ఫిదా సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. సంవత్సరానికి ఒక సినిమా తీసినా అది ఖచ్చితంగా హిట్టయ్యే విధంగా జాగ్రత్తపడతారు శేఖర్ కమ్ముల. దిల్ రాజు నిర్మాతగా ఫిదా సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మళ్ళీ శేఖర్ కమ్ముల

ఫిదా సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. సంవత్సరానికి ఒక సినిమా తీసినా అది ఖచ్చితంగా హిట్టయ్యే విధంగా జాగ్రత్తపడతారు శేఖర్ కమ్ముల. దిల్ రాజు నిర్మాతగా ఫిదా సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మళ్ళీ శేఖర్ కమ్ముల అమెరికాకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గత రెండురోజుల క్రితం ప్రభాస్‌కు ఫోన్ చేసి ఒక కథను సిద్ధం చేశానని, ఆ సినిమా మీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు ఉంటుందని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారట.
 
అయితే ప్రభాస్ శేఖర్ కమ్ములను కొన్ని ప్రశ్నలు అడిగారట. నేను లవర్ బాయ్‌గా బాగుంటానా.. గతంలో కొన్ని సినిమాలు ఫెయిలయ్యాయి. అందుకే అడుగుతున్నాను శేఖర్ కమ్ములగారు అని అడిగారట. హీరో ఎలా ఉన్నా ఫర్వాలేదు. కథ ముఖ్యం అని ప్రభాస్‌కు చెప్పారట. 
 
అమెరికా నుంచి రాగానే కథను మీకు వినిపిస్తాను. మీకు మంచి మైలేజ్ వచ్చే సినిమా అని కూడా శేఖర్ కమ్ముల ప్రభాస్‌కు చెప్పారట. దీంతో ప్రభాస్ కూడా ఒప్పేసుకున్నారట. సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారట. మరో రెండు నెలల్లో వీరి సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది.