శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (14:48 IST)

ప్రభాస్ - నీహారిక పెళ్లి? : మెగాస్టార్ ఏమన్నారు? (Video)

బాహుబలి ప్రభాస్, మెగా డాటర్ నీహారికలు పెళ్లి చేసుకోబోతున్నారా? హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

బాహుబలి ప్రభాస్, మెగా డాటర్ నీహారికలు పెళ్లి చేసుకోబోతున్నారా? హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 
 
నిజానికి భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్‌లో అయితే సల్మాన్ ఖాన్, టాలీవుడ్‌లో అయితే ప్రభాస్. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ తర్వాత హీరోయిన్ అనుష్కను పెళ్ళి చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇపుడు కొత్తగా మెగా డాటర్ నీహారికకు, ప్రభాస్‌కు పెళ్లి అనే వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. 
 
దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం నీహారిక తన కెరీర్‌పై ద‌ృష్టి పెట్టిందని తెలిపారు. అందువల్ల రూమర్స్‌ని తక్షణమే ఆపేయండి అంటూ కోరారు. కాగా, ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో "సాహో" సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. అలాగే, తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ నీహారిక కూడా బిజీగా గడుపుతున్నారు.