సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (10:51 IST)

నిఖిల్ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్.. రూ.2కోట్లు డిమాండ్?

సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్‌కు ప్రస్తుతం అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ''ఒరు ఆధార్ లవ్'' అనే సినిమా పాటకు సంబంధించిన వీడియో

సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్‌కు ప్రస్తుతం అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ''ఒరు ఆధార్ లవ్'' అనే సినిమా పాటకు సంబంధించిన వీడియోలో కను సైగలతో యూత్‌ను ఆకట్టుకున్న ఈ భామకు దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా అవకాశాలు వస్తున్నాయట.
 
తాజాగా నిఖిల్, తరుణ్ భాస్కర్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ప్రియా ప్రకాష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే నిఖిల్‌తో సినిమా చేసేందుకు ఆమె మేనేజర్‌ రూ.2కోట్లు డిమాండ్ చేశారట. అలాగే ప్రియా వారియర్ కోసం టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం.