ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (16:07 IST)

రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్‌. అంచ‌నాల గురి త‌ప్పిందా!

Ajay dev-Rajamouli
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తీసిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా క‌లెక్ష‌న్ల‌ప‌రంగా వంద‌ల కోట్ల‌లో వుంద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా చాలాచోట్ల ర‌న్ ప‌డిపోయింది. విడుద‌లైన మొద‌టిరోజు నుంచే డివైడ్ టాక్ రావ‌డంతో చాలా మంది చూడ్డానికే వెనుకంజ వేశార‌ని స‌మాచారం. బాలీవుడ్‌లో అస‌లు అడ్వాన్స్ బుకింగ్ కూడా లేవ‌ట‌. ఆ త‌ర్వాత రోజువారీ థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్లు ప‌రిమితంగానే వున్నాయ‌ని తెలుస్తోంది.
 
చిత్ర నిర్మాత డి.వి.వి. దాన‌య్యకు రాజ‌మౌళి ఇచ్చిన మార్కెటింగ్ అంచ‌నా అనేది చేరుకోలేక‌పోయింద‌ని తెలుస్తోంది. ఒక్కో ఏరియాలో ముగ్గురు వ్య‌క్తులు కొన‌డం ఇందుకు కార‌ణం. రిటైల్, టోల్ వ‌ర్త‌కంలా ఈ వ్యాపారం జ‌రిగింది.  ఒక ప్ర‌ముఖ సంస్థ ఆర్‌.ఆర్‌.ఆర్‌.ను. వైజాగ్‌లో తీసుకుని మ‌రో సంస్థ‌కు అమ్మేశారు. తిరిగి అత‌ను మ‌రో పంపిణీదారుడికి అమ్మిన‌ట్లు స‌మాచారం. ఇలా టోకుగా సినిమాను ముక్క‌లుముక్క‌లుగా ఒక‌రికి ముగ్గురు కొన‌డంతో మూడో వ్య‌క్తికి పెట్టిన పెట్టుబ‌డి రాబ‌ట్ట‌లేక‌పోయింది.
 
ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆర్‌.ఆర్‌.ఆర్. సినిమాలో ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అయ్యే క‌థ లేక‌పోవ‌డమే కార‌ణం. ఎంత విజువ‌ల్ వండ‌ర్స్‌గా చూపించినా కొన్ని చోట్ల బాహుబ‌లిని, రాదేశ్యామ్‌ను, కె.జి.ఎఫ్‌.ను బీట్ చేసింద‌నే వార్త శుధ్ధ అబ‌ద్ధ‌మ‌ని వైజాగ్‌కుచెందిన పంపిణీదారులు తెలియ‌జేస్తున్నా. ఇదంతా రాజ‌మౌళి టీమ్ త‌మ సోష‌ల్‌మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేస్తంద‌నీ, అస‌లు వాస్త‌వం వేరుగా వుంద‌ని తెలియ‌జేశారు. మా ప‌రిస్థితి గ‌మ‌నించిన‌ నిర్మాత డి.వి.వి.దాన‌య్య జి.ఎస్‌.టి.లో కొంత మిన‌హాయింపు ఇచ్చాడ‌ని తెలిపారు.