గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (20:50 IST)

కూతురు చెప్పినా వినని ర‌జ‌నీకాంత్... ఆ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన కాలా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం... ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజే ర‌జ‌నీ కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సినిమాని ప్రారంభించారు. డెహ‌డ్రూన్‌లో ఈ సినిమా షూటింగ్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన కాలా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం... ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజే ర‌జ‌నీ కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సినిమాని ప్రారంభించారు. డెహ‌డ్రూన్‌లో ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. ఇందులో ర‌జ‌నీ క్యారెక్ట‌ర్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ట‌. అభిమానులు ఖ‌చ్చితంగా క‌నెక్ట్ అయ్యేలా ఈ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని తెలిసింది. ఇదిలా ఉంటే... ర‌జ‌నీకాంత్ మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని కోలీవుడ్ స‌మాచారం.
 
ఇంత‌కీ ఆ... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే... మురుగుదాస్. ఇటీవ‌ల మురుగుదాస్ ర‌జ‌నీకాంత్‌ని క‌లిసి క‌థ చెప్పార‌ట‌. క‌థ విని ర‌జ‌నీ వెంట‌నే ఓకే చెప్పార‌ని త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. డిసెంబ‌ర్‌లో ఈ సినిమాని ప్రారంభించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 
 
మరోవైపు ఇటీవలే తన తండ్రి రజినీకాంత్ ఇక సినిమాల్లో నటించడం ఆపేస్తే బెటర్ అని రజినీకాంత్ కుమార్తె డైరెక్టుగా చెప్పేసింది. ఐనా రజినీకాంత్ మాత్రం ఆమె మాట వినేట్లు లేరు. వరుసగా సినిమాల్లో నటించడానికే మొగ్గు చూపుతున్నారు. ఇదిలాఉంటే.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రోబో సీక్వెల్ 2.0 వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రిలో రిలీజ్ అంటున్నారు. మ‌రి.. జ‌న‌వ‌రిలో అయినా వ‌స్తుందో లేదో..?