బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (15:31 IST)

సమంత ప్రెగ్నెంట్ అయ్యిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్ అయ్యిందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇది రియల్ కాదు.. రీల్ కోసం. అవును సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా నటించబోతోంది.
 
అక్కినేని మాజీ కోడలు సమంత ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యశోద సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. 
 
ఇప్పటికే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ కూడా పూర్తి అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఇందులో సమంత ప్రెగ్నెంట్ లేడీగా నటించబోతోంది. సినిమాలో దాదాపు గంటకు పైగా ప్రెగ్నెంట్‌‌గానే అందరికీ సమంత కనిపించనుందట.