గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (18:35 IST)

శృతిహాసన్‌కు కొత్త బాయ్‌ఫ్రెండ్ దొరికాడా? అతనే సర్వస్వమట!

ఇండస్ట్రీలో వుండే సెలెబ్రిటీలు ప్రేమ, బ్రేకప్ చెప్పడం సర్వసాధారణం. తాజాగా శృతిహాసన్ కూడా ఇటీవల లండన్‌కు చెందిన మైకేల్‌తో ప్రేమ, బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే అనంతరం ఈమె ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతన హజారికా అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. ప్రస్తుతం ముంబైలో వీరిద్దరూ ఒకే ఫ్లాట్‌లో నివసిస్తూ ఉన్నారు. 
 
ఇక నిత్యం వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండదు.ఇక గత కొద్ది రోజుల క్రితం పెళ్లి గురించి శృతిహాసన్ అని ప్రశ్నించగా తనకు పెళ్ళంటే ఆందోళనకరంగా ఉంది అంటూ సమాధానం చెప్పుకొచ్చారు.
 
తాజాగా మరోసారి ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సుదీర్ఘంగా ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితానికి అలాగే వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 
 
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ప్రపంచంలో మీరు అమితంగా ప్రేమించే వ్యక్తి ఎవరు అంటూ ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ కెమెరాను పక్కనే ఉన్న తన ప్రియుడి వైపు చూపిస్తూ తానే తన సర్వస్వం అని ఈ సందర్భంగా శ్రుతిహాసన్ తన ప్రియుడు గురించి తెలియజేశారు.