బాలకృష్ణ 107 సినిమాలో ప్రత్యేకతలు
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా 107 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతున్న ఈ చిత్రానికి క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి త్వరలో టైటిల్‌ను ప్రకటించనున్నాట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో ఇప్పటికే బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సీనియర్ బాలకృష్ణ తన ఊరిలోని వారందరికీ సామూహిక వివాహాలు చేయించిన సన్నివేశం జియర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఆయనకు చెల్లిగా నటిస్తోంది. చెల్లెలు సెంటిమెంట్ హృదయానికి హత్తుకునే వుంటుందని చిత్రయూనిట్ తెలియజేస్తోంది. బాలకృష్ణకు హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరిపై కొంత షూట్ కూడా చేశారు.
బాలయ్యమార్క్ డైలాగ్స్ వుండేలా దర్శకుడు తగు చర్యలు తీసుకుంటున్నాడు. ఇందుకు ఇద్దరు రచయితలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చేలా థమన్ తగిన బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు ట్యూన్‌లు సమకూరాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.