ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (22:21 IST)

శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లో అదితి రావు-సిద్ధార్థ్... తర్వాత వీరికేనా పెళ్లి?

Siddharth, Aditi Rao Hydari
Siddharth, Aditi Rao Hydari
హైదరాబాద్‌లో జరిగిన టాలీవుడ్ నటుడు శర్వానంద్- రక్షిత నిశ్చితార్థ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ హాజరయ్యారు. దీంతో సిద్ధార్థ్-అదితి రావు హైదరీలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారా అని చర్చ సాగుతోంది. 
 
ఇటీవలే రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
 
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్- ఉపాసన కొణిదెల మ్యాచింగ్ దుస్తులతో ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరయ్యారు. గులాబీ రంగు దుస్తుల్లో మెరిశారు. అలాగే శర్వానంద్, రక్షిత జంటగా ఉన్న  ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.