ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

Written By సెల్వి
Updated: ఆదివారం, 5 ఏప్రియల్ 2026 (21:24 IST)
ప్రేమపై సినీ నటి త్రిష ఆసక్తికర పోస్టు చేశారు. ప్రేమ అనేది సర్వస్వం కాదని.. కానీ అది లేకుండా అంతా శూన్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ పోస్టు చూసిన వారంతా ఆమె ఎవరితోనూ ప్రేమలో వుందని అందుకే ఇలాంటి పోస్టు పెట్టిందని అంటున్నారు. దీనితో పాటు ఆమె పంచుకున్న రెండు వీడియో కోట్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాను ఇప్పుడు జీవితంలో ఒక కొత్త దశలోకి ప్రవేశించానని అనవసరమైన వాదనలకు దూరంగా వుండటమే తన ప్రస్తుత సూత్రమని ఆమె పేర్కొన్నారు. 
 
జీవితంలో తాను ఇప్పుడు ఎవరితోనూ వాదించని స్థితిలో ఉన్నానని త్రిష తెలిపింది. ఒక వేళ మీరు ఏనుగు ఎగురుతుందని చెబితే.. అవును మీరు చెప్పింది నిజమే అని చిరునవ్వుతో ఒప్పేసుకుంటాను అంటూ త్రిష తెలిపింది. ఎందుకంటే మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక, ఆసక్తి తనకు లేవు. 
 
సరైనదిగా నిరూపించుకోవడం కంటే మనశ్శాంతి చాలా విలువైనదని తాను నేర్చుకున్నానని.. వివరణలు ఇవ్వడం కంటే మౌనంగా ఉండటమే మేలు. ప్రతి ఒక్కరూ మన శక్తిని పొందేందుకు అర్హులు కారని త్రిష ఎంతో లోతైన అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. ఎదుగుదల అంటే గట్టిగా అరవడం కాదని, కొన్నిసార్లు నిశ్శబద్ధంగా వుండటమేనని త్రిష అభిప్రాయపడ్డారు. 

అన్నీ చూడండి

బొద్దింకల ముసుగులో 2,873 నేరచరితులు, 989 మందిపై హత్య, లైంగిక దాడుల కేసులు...

ప్రశ్నపత్రాల లీక్ చేయాలంటేనే ఇకపై వెన్నులో వణుకు పుడుతుంది : కిషన్ రెడ్డి

మతం మారితే ఎస్సీ హోదా రద్దు : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

తూర్పు గోదావరి జిల్లాలో కనిపించిన మగపులి.. రేడియో కాలర్ ద్వారా...?

అయోధ్య విరాళాల చోరీ కేసు : 2 వారాల్లో సమగ్ర నివేదికకు సుప్రీం ఆదేశం

అన్నీ చూడండి

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments