మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శుక్రవారం, 12 అక్టోబరు 2018 (13:51 IST)

బన్నీ నెక్స్ట్ మూవీపై దృష్టి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఆయన చివరిగా "నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా" అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ తర్వాత బ‌న్నీ సినిమాపై ఇంతవర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ఉంటుంద‌నే ప్రచారం జోరుగా సాగింది.
 
కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌న్నీ తదుపరి చిత్రాన్ని త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం సాగుతోంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "అర‌వింద స‌మేత వీర రాఘవ" చిత్రం అక్టోబరు 11వ తేదీ గురువారం విడుదలైన విషయం తెల్సిందే. ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ కూడా స్పెష‌ల్ స్క్రీనింగ్‌లో వీక్షించాడ‌ట‌. 
 
దీంతో త్రివిక్రమ్‌కు బన్నీ ఓకె చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వరిలో సెట్స్ పైకి వెళుతుందట. అలాగే, మూవీని వచ్చే ద‌స‌రాకి రిలీజ్ చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. బ‌న్నీ- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.