మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (18:51 IST)

గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి పనులు చేస్తున్న వరుణ్ తేజ్

varun tej - lavanya
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరు సైలెంట్‌గా పెళ్లి పనులు కానిస్తున్నారు. ఆగస్టు 24న పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు తెలిసినప్పటికీ ఇటలీలోని ఓ ప్యాలెస్‌ను బుక్ చేసుకున్నారని తెలిసింది. 
 
అంతేకాదు తన పెళ్లికి పిలిచే వారికి స్పెషల్ కార్డ్స్ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇందుకోసం భారీగా ఖర్చు పెడుతున్నారని తెలిసింది. ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ముకుందాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. ఆ తర్వాత మరో ప్రయోగం కంచె. 
 
ఈ సినిమాను క్రిష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయం సాధించింది. అంతేకాదు సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డు కూడా వచ్చింది. 
 
ఆపై వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జునలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది. ఈ సినిమాతో పాటు వరుణ్.. పలాస ఫేమ్ కరుణ కుమార్‌తో మరో చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాకు మట్కా అనే టైటిల్‌ను ఖరారు చేశారు.