శుక్రవారం, 19 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (19:36 IST)

మళ్లీ విజయ్‌తో రాశిఖన్నా రొమాన్స్... సమంత పక్కనుండి కూడా..?

Rasi Khanna
Rasi Khanna
విజయ్ దేవరకొండ, రాశిఖన్నా కాంబినేషన్ కొత్తేమీ కాదు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషీ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. నిజానికి ఖుషీ సినిమాలో హీరోయిన్ ఆల్రెడీ ఉంది. ఇందులో మెయిన్ హీరోయిన్ సమంత. 
 
కాకపోతే సెకండాఫ్‌లో వచ్చే మరో కీలకమైన పాత్ర కోసం ఇంకో హీరోయిన్ కావాలి. ఆ క్యారెక్టర్ కోసం రాశి ఖన్నాను తీసుకున్నట్టు తెలుస్తోంది. పాత్ర నచ్చడంతో, సెకెండ్ లీడ్ అయినప్పటికీ చేయడానికి రాశీఖన్నా రెడీ అయ్యింది. 
 
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఖుషి సినిమా. లైగర్ ఫ్లాప్‌తో ఇటు విజయ్ దేవరకొండ, టక్ జగదీశ్ ఫ్లాప్‌తో అటు శివ నిర్వాణ ఇద్దరూ కసి మీదున్నారు. ఇంకేముంది.. ఈసారైనా హిట్ కొడతారా లేదా అనేది వేచి చూడాలి.