పాపం.. మహేష్, ప్రభాస్ హ్యాండ్ ఇచ్చారు, అందుకే ఈసారి ప్లాన్ మార్చాడా..?
అర్జున్ రెడ్డి.. టాలీవుడ్నే కాకుండా.. బాలీవుడ్ని సైతం షేక్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ద్వారా సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండకి యూత్‌లో మంచి క్రేజ్ వచ్చిన సినిమా ఇది. బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తే.. అక్కడ కూడా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సంచలన చిత్రం దర్శకుడు సందీప్ రెడ్డికి డిమాండ్ బాగా పెరిగింది.
అయితే.. ఇలా టాలీవుడ్, బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డికి డిమాండ్ అయితే పెరిగింది కానీ.. ప్రాజెక్ట్ మాత్రం సెట్ కావడం లేదు. అదేంటి.. వరుసగా రెండు సంచలన చిత్రాలను అందించిన సందీప్ రెడ్డికి హీరోలు డేట్స్ ఇవ్వకపోవడం ఏంటి..? ప్రాజెక్ట్ సెట్ కాకపోవడం ఏంటి..? అనుకుంటున్నారా..? కానీ.. ఇది వాస్తవం. మహేష్ బాబుతో సినిమా చేయాలనున్నాడు. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి.
ఇక ఈ ప్రాజెక్ట్ గురించి అఫిషియల్ ఎనౌన్స్మెంట్ వస్తుంది అనుకుంటే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కారణం ఏంటంటే... సందీప్ చెప్పే కథలు అన్నీ.. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటున్నాయని.. ఇప్పటివరకు రాని కథలు చెబుతున్నప్పటికీ ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంటుందో అనే అనుమానంతో హీరోలు ధైర్యం చేయలేకపోతున్నారని తెలిసింది.
మహేష్ తర్వాత ప్రభాస్‌తో మూవీ ప్లాన్ చేసాడు సందీప్ రెడ్డి. ప్రభాస్ - సందీప్ రెడ్డి కాంబినేషన్లో మూవీ కన్ఫర్మ్ అనుకున్నారు కానీ.. ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లమ్.
కథ బాగానే ఉంది కానీ... డిఫరెంట్ స్టోరీ. ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో..? ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనే అనుమానంతో ఈ మూవీకి ఓకే చెప్పలేదని తెలిసింది. బాలీవుడ్లో మూవీ ప్లాన్ చేసినా అక్కడ కూడా అదే పరిస్థితి. ఇలా.. టాలీవుడ్ లోను, బాలీవుడ్ లోను సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్‌కి హీరోలు సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ సెట్ కాకపోవడం లేదు.
తాజా వార్త ఏంటంటే... అర్జున్ రెడ్డి సినిమాలో నటించి యూత్‌ని ఎంతగానో ఆకట్టుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో మూవీ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది.
పూరి - ఛార్మి - కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. సందీప్ రెడ్డి విజయ్ కోసం ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేసారని.. తెలిసింది. ప్రస్తుతం విజయ్ ఓకే చేసిన సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత సందీప్ రెడ్డితో సినిమా స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.