అత్తి వరద స్వామి సేవలో సూపర్ స్టార్ దంపతులు(Video)

Last Updated: బుధవారం, 14 ఆగస్టు 2019 (12:59 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు అర్థరాత్రి కంచి అత్తివరదరాజ స్వామి వారి దర్శనార్థం కాంచిపురం చేరుకున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆలయానికి చేరున్నారు. వసంత మండపం లోని అతి వరదరాజ స్వామి వారిని దర్శించుకున్నారు. 
 
రజినీకాంత్ అత్తి వరదరాజ స్వామి చరిత్రను అర్చకస్వాములు వివరించారు. ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత కాంచీపురం నుండి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనతో ఫొటోలు దిగడానికి పెద్ద ఎత్తున అభిమానులు పోటీపడ్డారు. 
 
 
కాగా.. 40 ఏళ్లకు ఓసారి దర్శనమిచ్చే కాంచీపురం అత్తి వరదరాజస్వామి దర్శనం ఈ నెల 17న ముగియనుంది. మళ్లీ 2062లోనే స్వామి దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదరాజస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.దీనిపై మరింత చదవండి :