1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (14:08 IST)

కోమాలోకి వెళ్లిపోయిన బిచ్చగాడు హీరో ?

vijay antony
బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కోమాలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం విజయ్ ఆంటోనీ తన కొత్త చిత్ర షూటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన బిచ్చగాడు 2 సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన  షూటింగ్ మలేషియాలో జరుగుతుంది. 
 
విజయ్ ప్రయాణీస్తున్న బోట్ పక్కనే వున్న క్రూ సిబ్బంది పడవని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటన తర్వాత విజయ్ ని మలేషియా నుంచి చెన్నైకి తీసుకొచ్చినట్లు కోలీవుడ్ మీడియా తెలిపింది. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ కోమాలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్తలను విజయ్ ఆంటోనీ సన్నిహితులు కొట్టిపారేశారు. బిచ్చగాడు 2ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు.