మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (10:39 IST)

నెలకు రూ.199.. యేడాదికి రూ.999.. గెహనా వశిష్ట్ వెబ్‌సైట్ చందా డిటైల్స్...

బి.టెక్ లవ్ స్టోరీ, నమస్తే, ఐదు, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి వంటి తెలుగు చిత్రాల్లో నటించిన గెహనా వశిష్ట్ బ్లూఫిల్మ్ కేసులో అరెస్టు అయింది. ఆమెను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ముంబై మహానగరంలోని ఓ బంగళాల్లో రహస్యంగా అశ్లీల చిత్రాలను షూట్ చేసి, వాటిని తన వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తూ ఆమె పట్టబడ్డారు. ఈ వెబ్‌సైట్ చూడాలంటే చందా చెల్లించాల్సివుంటుంది. ముఖ్యంగా, నెలకు రూ.199, మూడు నెలలకు రూ.499, ఒక సంవత్సరానికి రూ.999 చొప్పున చెల్లించాలి. అలాగే, పూర్తి నగ్నవీడియోలనూ చూడాలనుకునేవారు నెలకు రూ.2000 చందా చెల్లించాల్సి వుంటుంది. 
 
సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో గెహనా వశిష్ట్ ఈ పాడుపనికి పూనుకుంది. నీలి చిత్రాల్లో నటిస్తూ.. ఆ వీడియోలను ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి.. సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు కింద రూ.2000 వసూలు చేస్తున్న గెహనా వశిష్ట అండ్‌ టీమ్‌ను తాజాగా ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు.
 
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... గెహానా వశిష్టకు సంబంధించిన సుమారు 87 నీలి చిత్రాలు ఆ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, వాటిని చూసేందుకు వీక్షకుల నుంచి రూ.2000 ఫీజు వసూలు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆమెను, ఆమెతో నీలి చిత్రాలను నిర్మిస్తున్నవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.