సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (19:17 IST)

అక్కా! బావ సినిమా గురించి బాగా రాయ్‌ - పూన‌మ్ కౌర్‌

Poonam twitter shot
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, పూన‌మ్ కౌర్ గురించి కొత్త‌గా చెప్ప‌దేమీ లేదు. ఇద్ద‌రు సినిమాల్లో న‌టించారు. ఇద్ద‌రికీ మంచి రాపో కూడా వుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటే పిచ్చి ప్రేమ‌. తాజాగా ఈరోజు విడుద‌లైన భీమ్లా నాయ‌క్ సినిమా గురించి త‌న స్నేహితురాలుకు అక్కా! అని సంబోధిస్తూ, అక్కా బావ సినిమాకు వ‌చ్చాను.. అంటూ ఉద‌య‌మే పోస్ట్ చేసింది. అక్కా బావ సినిమా గురించి బాగా రివ్కూ ఇవ్వు అంటో తెలియ‌జేసింది. ఇది ట్విట్ట‌ర్‌లో ఫాన్స్‌కు ఫిదా చేసేలా వుంది. బాగా వైర‌ల్ అయిపోయింది.
 
ఒక ప‌క్క  థియేటర్లలో అభిమానులు చేస్తున్న రచ్చకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.  సినిమాలో పవన్, రానా నటనతో పాటు త్రివిక్రమ్ డైలాగులు, తమన్ మ్యూజిక్ సినిమాలో ప్రధాన హైలెట్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ ‘భీమ్లా నాయక్’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. “బావ సినిమాకి వచ్చాను అక్కా” అని ఎవరో ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను పంచుకుంది. అందులో హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ అడుగుతోంది. దానికి ఆమె కూడా ఓకే చెప్పింది. ఆమె ఎవ‌రో తెలియ‌ప‌ర్చ‌లేదు. కానీ కొంద‌రు హీరోయిన్లు కౌర్ కామెంట్‌కు బాగానే స్పందించారు.