శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (12:35 IST)

జబర్దస్త్‌ జడ్జిగా ఆ ముగ్గురు.. నాగబాబు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో?

జబర్ధస్త్ షోను తనదైన జడ్జిమెంట్‌తో నడిపించిన నాగబాబు.. ప్రస్తుతం ఉన్నట్టుండి ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పేశారు. జబర్థస్త్‌లో నాగబాబు ప్లేస్‌ను ఎవరు రీప్లేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ షో కోసం జబర్ధస్త్ షో నుంచి మూడు నాలుగు టీమ్స్‌ను జీ తెలుగుకు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్‌ షోలో నాగబాబు లేకుండానే రోజాతోనే కంటిన్యూ చేయాలని ముందుగా షో నిర్వాహకులు భావించారు. కానీ ఆయన ప్లేస్‌లో డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ను జడ్జ్‌గా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాయి కుమార్ ఈటీవీలో ప్రసారమయ్యేు పలు రియాల్టీ షోలను తనదైన యాంకరింగ్‌తో విజయ తీరాలకు చేర్చని సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.
 
సాయి కుమార్‌‌తో పాటు ఆలీని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు బండ్ల గణేష్‌ను కూడా సైడ్ ట్రాక్‌లో పెట్టారు జబర్ధస్త్ షో  నిర్వాహకులు. వీళ్లిద్దరిలో ఎవరైన రాకపోతే.. వాళ్ల ప్లేస్‌‌ను బండ్ల గణేష్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారు.