శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (19:32 IST)

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

chiranjeevi, allu aravind
chiranjeevi, allu aravind
ఓవర్ కాన్ఫిడెన్సు తో తగ్గేదేలే అన్నట్లు గా అల్లు అరవింద్ ఉండటం అందరి నీ ఆచ్చర్యం కలిగించింది. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య సత్సంభందాలు లేవని అందరికి ఎరుకే. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో పోతిచేయగా అల్లు అర్జున్ తన శైలి లో వ్యతెరేక పార్టి కి ప్రచారం చేసారు. ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి. తాజా గా ఓ విషయం జరిగింది. తందేల్ సినిమా ను అల్లు అర్జున్ నిర్మించారు. గీత ఆర్ట్స్ లో రూపొందింది.
 
కాగా, నిన్న జరిగిన ప్రమోషన్ లో అల్లు అరవింద్ ను మీడియాకు  సినిమా గురించి, నాగ చైతన్య, సాయిపల్లవి డాన్స్ గురించి గొప్పగా ఆయన చెప్పారు. అయితే చైతు లా ఒకసారి స్టెప్ వేయమని అడిగితే నాకు డాన్సు రాదు. ఎదో మ్యూజిక్ వింటూ చిన్నగా కాలు కదుపుతాను అన్నారు. నాకంటే మావాడు (అల్లు అర్జున్ ) బాగా డాన్స్ చేస్తాడు. అది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆమె మంచి డాన్సర్ అని చెప్పారు. కాని చిరంజీవి పేరు చెప్పకపోవడం అందరికి వింతగా అనిపించింది. 
 
చిరంజీవి నుంచే డాన్సు నేర్చు కున్నాడని గతంలో చెప్పిన ఆయన ఇప్పడు అస్సలు పేరు కూడా ప్రస్తావించకపోవడంతో ఇంకా వారి గొడవలు ముదిరాయని తెలుస్తోంది.ఇదిలా ఉండగా తందేల్ కు రేటింగ్ నేను మాత్రం 4.5 ఇస్తానని చెప్పారు.