గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (16:55 IST)

అమ్మ తర్వాత అమ్మ ఇది: సాయిధరమ్‌తేజ్‌

Saidharamtej, helmet
Saidharamtej, helmet
హీరో సాయిధరమ్‌ తేజ్‌కు గత ఏడాది బైక్‌లో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి కోమాలో వుండి కొంతకాలానికి కోలుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కోలుకుని విరూపాక్ష సినిమా చేశాడు. ఈనెల 21న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో ఎక్కడికి వెళ్లినా వెంట ఓ హెల్మెట్‌ పెట్టుకుని వెళుతుంటాడు. ఈ విషయాన్ని ఆయన చెబుతూ, నాకు అమ్మ తర్వాత అమ్మలాంటిది ఈ హెల్మెట్‌. ఈ హెల్మెట్‌లో పైన చుట్టూరా రేడియేషన్‌ గీతలుగా వున్నాయి. అవి చాలా స్ట్రాంగ్‌ కిందపడ్డా హెల్మెట్‌కు పెద్ద దెబ్బతగిలినా అది గట్టిగా వుండి. మన తలను కాపాడుతుందంటూ వివరించారు.
 
అందుకే ఈ హెల్మెట్‌ మా అమ్మ తర్వాత అమ్మలాంటిదని చెప్పారు. ఇక విరూపాక్ష సినిమా ఓ విలేజ్‌తో జరిగే వరుస హత్యల నేపథ్యంలో సాగే కథ. కథ దర్శకుడు కార్తీక్‌ చెప్పగానే నాకు భయమేసింది. అంతలా తను నెరేషన్‌ చెప్పేటప్పుడు ఇన్‌వాల్వ్‌ చేశాడని అన్నారు.