మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (19:10 IST)

స‌మంత కొత్త పెళ్లికూతురాయె!

Samantha
న‌టి స‌మంత స‌రికొత్త‌గా పెళ్లి దుస్తుల్లో ముస్తాబ‌యింది. ఇటీవ‌లే ఈ దుస్తులు ధ‌రించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దాంతో గత కొన్ని రోజులుగా సమంత, నాగ చైతన్యకు విడాకులు అంటూ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను స‌మ‌త పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సామ్ మావూరి సిల్క్స్ నుండి ఎరుపు, బంగారు బనారసీ చీరను కట్టుకుని అందంగా కనిపిస్తుంది. నటి ఈ చీరకు హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్‌ ధరించింది. ఇందులో నెక్‌లైన్, బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ ఉంది. జతిన్ మోర్ జ్యువెల్స్ బంగారు ఆభరణాలు వేసుకుంది. ఇంకా సాధనా సింగ్, కోడూరు అమర్‌నాథ్ సామ్ మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ చేశారు.
 
కాగా, ఇదంతా మావూరీ సిల్క్ అనే కొత్త యాడ్ కోసం ఈ ఫోటోలు దిగినట్టు కన్పిస్తోంది. విశేషం ఏమంటే సామ్ చైతుతో పెళ్ళిలో కూడా దాదాపు ఇలాగే కన్పించింది. ప్ర‌స్తుతం శాకుంత‌లం షూట్‌లో సామ్ పాల్గొంది. దుష్యంతుని శ‌కుంత‌ల‌క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతోంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.