1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (11:20 IST)

'బంగార్రాజు'లో తాతా మనవళ్లుగా తండ్రీకొడుకులు

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ననాయన చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం జోరుగా షూటింగు జరుపుకుంటోంది. 
 
గ్రామీణ నేపథ్యంలో పల్లెటూరి బుల్లోడుగా ఈ సినిమాలో నాగార్జున కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతూ జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. 
 
ఈ సినిమాలో నాగార్జున - చైతూ తండ్రీ కొడుకులుగానే కనిపించవచ్చని అంతా అనుకున్నారు. కానీ వాళ్లిద్దరూ ఈ సినిమాలో తాతామనవళ్లుగా కనిపించనున్నారని అంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది.
 
కానీ ఇప్పుడు తాత చైతూ అయితే, మనవడు నాగార్జున అంటున్నారు. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సివుంది. స్వర్గం సెట్లో రంభ .. ఊర్వశి .. మేనకల మధ్య రొమాంటిక్ సాంగ్‌లు ఉన్నాయని చెబుతున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.