సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (13:25 IST)

''భాగమతి'' ట్రైలర్ బాగుంది.. స్వీటీని పొగిడిన డార్లింగ్

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క టైటిల్‌ రోల్‌లో ''పిల్ల జమీందార్'' ఫేమ్‌ జి.అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''భాగమతి''. యూవీ క్రియేషన్స్‌‌ బ్యానర్‌పై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 26వ తేద

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క టైటిల్‌ రోల్‌లో ''పిల్ల జమీందార్'' ఫేమ్‌ జి.అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''భాగమతి''. యూవీ క్రియేషన్స్‌‌ బ్యానర్‌పై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‌, జయరాం, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.
 
ఈ ట్రైలర్‌కు ఇప్పటికే 2,002, 434 వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్‌పై తాజాగా డార్లింగ్ ప్రభాస్ స్పందించాడు. బాహుబలిలో అనుష్కతో కలిసి నటించిన ప్రభాస్.. తన స్నేహితురాలైన స్వీటి భాగమతి ట్రైలర్ బాగుందని కితాబిచ్చాడు. 
 
''భాగ‌మ‌తి'' చిత్ర ట్రైల‌ర్ గురించి ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పందించారు. ట్రైల‌ర్ బాగుంద‌ని, స్వీటీని పొగిడాడు. అనుష్కకి క‌ష్ట‌ప‌డేత‌త్వం, అంకిత‌భావం ఎక్కువని ప్రభాస్ తెలిపాడు. సినిమాలో అనుష్క న‌ట‌న బాగుంద‌ని, ద‌ర్శ‌కుడు అశోక్‌కి, చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్‌కి ఆల్ ద బెస్ట్ అన్నాడు ప్రభాస్. డార్లంగ్ ప్రస్తుతం ''సాహో'' సినిమా షూటింగ్‌లో వున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక బాలీవుడ్ సినిమాలో నటిస్తాడు.