సమంతకు "ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా" తెచ్చిన తంట...
అస్సలే వ్యక్తిగత సమస్యల్లో నలిగిపోతున్న హీరోయిన్ సమంతకు ఇపుడు ఒక కొత్త సమస్య వచ్చిపడింది. ఆమె సినీ ప్రేక్షకులను ఆనందపరిచాలన్న ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన "పుష్ప" చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్లో నర్తించారు. ఈ నెల 17వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది.
అయితే, ఈ ఐటమ్ సాంగ్ ఇపుడు వివాదాన్ని రేపింది. "ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా" అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పాట వినేందుకు కాస్త వల్గర్నే ఉంటుంది. కానీ, వినేకొద్దీ అందులోని అర్థాన్ని గ్రహించవచ్చు.
ఈ నేపథ్యంలో ఈ పాట లో మగవారిని కించపరిచే విధంగా లిరిక్స్ ఉన్నాయంటూ ఏపీ పురుష సంఘం ప్రతినిధులు ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. మగవారు మరీ చులకన బుద్ధి కలవారు అంటూ అందరి గురించి ఐటమ్ సాంగ్లో ఉందని ఆ సంఘం ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పైగా, ఈ పాటను తక్షణం నిషేధించాలని రాష్ట్ర హైకోర్టులో పురుషుల సంఘం డిమాండ్ చేస్తూ పిటషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరగాల్సివుంది. మరి ఈ వివాదంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.