మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 మే 2023 (18:22 IST)

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కోసం పాట పాడిన ధనుష్‌, ఫన్నీ వీడియో చేసిన నవీన్ పోలిశెట్టి

Ramajogaiah Shastri, Naveen Polishetty
Ramajogaiah Shastri, Naveen Polishetty
ధనుష్ పాడిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 2వ పాట హతవిది మే 31న విడుదల కానుంది. హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన కొత్త సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ చిత్రంలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ చిత్రాల్లో పాటలు పాడుకుంటున్నారనీ తనూ పాడుకుంటానని చెబుతూ.. అటు నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ ల వద్ద ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. సరే అని మైక్ ఇచ్చారు. తీరా అతన పాడుతేంటే ప్యాన్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్‌ వాయిస్ వినిపిస్తోంది. మరి ఇదెలా సాధ్యం అంటే.. సింపుల్.. ఈ మూవీ కోసం నిజంగానే ధనుష్ పాట పాడాడు. 
 
అనౌన్స్‌మెంట్ వీడియోలో, నవీన్ తన దర్శకుడిని మరియు నిర్మాతను తాను పాట పాడతాను అని ఒప్పించే ప్రయత్నం చూశాం. కానీ వారు అతని తమాషా ప్రయత్నాలను తిరస్కరించారు. ఈ పాటకోసం ధనుష్‌ను దాని కోసం తీసుకువచ్చారు.''హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ.." అంటూ సాగే ఈ పాట.. ఆకట్టుకునేలా ఉంది. మే 31న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు ధనుష్‌ పాడుతున్న లిరికల్ వీడియో కూడా వస్తుంది.
 
ఇక ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్‌ బాబు.పి డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి తదితరులు నటించారు.