శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (16:58 IST)

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి కె.రాఘవేంద్ర రావు రాజీనామా

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్.వి.బి.సి) ఛైర్మన్ పదవికి ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు సోమవారం రాజీనామా చేశారు. అనారోగ్యంతో పాటు వయోభారం కారణంగా ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 
 
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయన్ను గతంలో తితిదే పాలకమండలి సభ్యుడుగా ఉన్న కె రాఘవేంద్ర రావు ఉన్నారు. ఆ తర్వాత గత యేడాది ఏప్రిల్ 21వ తేదీన ఆయన్ను ఎస్.వి.బి.సి ఛానెల్ ఛైర్మన్‌గా నియమించారు. 
 
ప్రస్తుతం దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా కొన‌సాగుతూ ఛానెల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన‌ ఆయనను అప్పటి ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేర‌కు టీటీడీ.. రాఘవేంద్రరావును ఛానెల్ చైర్మన్‌గా నియమించింది. 
 
రాఘవేంద్రరావు తన రాజీనామా లేఖను ఈవోతో పాటూ ప్రభుత్వానికి పంపారు. 2015 నుంచి ద‌ర్శ‌కేంద్రుడు టీటీడీలో బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న నేప‌థ్యంలో కె.రాఘ‌వేంద్ర‌రావు రాజీనామా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.