శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (14:41 IST)

పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ క్రిష్ణ ఎందుకు పెండ్లిళ్ళు చేసుకున్నారో తెలుసా!

Paruchuri Venkateswara Rao
Paruchuri Venkateswara Rao
అగ్ర హీరోల సినిమాలందరికీ సంభాషణలు, కథలు సమకూర్చిన వారు పరుచూరి బ్రదర్స్. అందులో  పరుచూరి వెంకటేశ్వరరావు సీనియర్. ఆయన మహేష్ బాబు ఒక్కడులో, ప్రభాస్ వర్షం సినిమాలో నటుడిగా నటించారు. ప్రస్తుతం అనారోగ్య కారణంగా గేప్ ఇచ్చిన ఆయన నేడు తన మనవుడు సుదర్శన్ ను హీరోగా పరిచయం చేస్తూ మిస్టర్ సెలబ్రిటీ సినిమా చేస్తున్న సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు. 
 
పవన్ కళ్యాణ్ మూడు పెండ్లిలు చేసుకున్నారు. ఎందుకు అలా చేసుకుంటారు అని అడిగితే, పవన్ కళ్యాణ్  పంజా సినిమాలో పనిచేశాను. ఆయన చాలా మంచోడు. ఇండస్ట్రీలో భయంలేనివాడు. ఎందుకంటే ఆయన తప్పుచేయడు. ఇక పెండ్లిలు గురించి అంటారా. ఆ అమ్మాయితో పడలేదు మరో అమ్మాయిని చేసుకున్నాడు. ఎవరికీ అన్యాయం చేయలేదు. 
 
అలాగే క్రిష్ణ, విజయనిర్మల పెండ్లిచేసుకున్నాడు. ఆవిడ వంట చాలా బాగుంటుంది. వంటకి పడిపోయాడమేమో అనిపించింది. అసలు క్రిష్ణగారి భార్య ఇందిర చాలా మంచి అమ్మాయి.. అంటూ వివరించారు. 
 
అదేవిధంగా ఇండస్ట్రీలో ఓ పోలిక వుంది. క్రిష్ణ గారు ముగ్గురు అన్నదమ్ములు. ఇద్దరు సోదరీమణులు, మెగాస్టార్ చిరంజీవికి కూడా ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు చెల్లెలు. మేము కూడా ముగ్గురు అన్నదమ్ములం. ఇద్దరు చెల్లలు వున్నవారమే అని తెలిపారు.