ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?
కొందరు నటీమణులు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వుంటున్నారు. ఎక్కడా లేని ఎక్స్ పోజింగ్ తో ముందుకు వస్తున్నాయి. జిమ్, స్విమ్మింగ్ షూట్ లతో ఫోలో పెడుతూ తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. అందులో నభా నటేష్ కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. గతంలో కొన్ని సినిమాలు చేశాక వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా వుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది. ఆమద్య ప్రియదర్శి నటించిన డార్లింగ్ లో ఆమె నటించింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో చురుగ్గా వుంటోంది.
ఈ కన్నడ భామ నభా నటేష్ గ్లామర్ ఫొటోలకంటే డిఫరెంట్‌గా, కారు మెకానిక్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందం, అభినయం అన్నీ ఉన్నా ఎందుకనో వెనుకబడిపోయింది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇమేజ్‌ని మెంటైన్ చేసుకుంటోంది.
తాజాగా ఆమె నిఖిల్ నటిస్తున్న స్వయంభూ చిత్రం లో నటించింది. ఆ తర్వాత ఫొటోషూట్ల పేరుతో డిఫరెంట్ స్టైల్‌లో, ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఫొటో షూట్ చేసి ఔరా అనిపించింది. లేటెస్ట్ గా ఓ కార్ల మెకానిక్ షోరూంలో కారును రిపేర్ చేస్తున్నట్లుగా ఒంటిపై ఆయిల్ పూసుకుని కనిపించింది. దీంతో చాలామంది నెటిజన్లు ఆ పాపకు ఎవడ్రా అయిల్ పూసిందంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో ఫోకస్ అయినా హీరోల ద్రుష్టిలో ఇంకా పడడంలేదు.