ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు
సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఈ ట్రస్టుకు విదేశీ విరాళాలు స్వీకరించేందుకు కేంద్రం హోం శాఖ అనుమతి ఇచ్చింది. విదేశీ విరాళాలు స్వీకరించేందుకు ట్రస్టుకు వీలు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు.
ఛారిటబుల్ ట్రస్టు కింద బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 కింద నమోదు చేసుకుని ఎఫ్సీఆర్ఏ అనుమతి తీసుకోవాలని ఇటీవల నిబంధనల్లో మార్పు చేశారు. నిబంధనల మార్పుతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కేంద్రం అనుమతి కోరింది.
ట్రస్టు విజ్ఞప్తికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోద ముద్రవేశారు. దీంతో విదేశాల్లో ఉండే ప్రవాస భారతీయులతో పాటు ఇతర విదేశీ స్వచ్చంద సేవా సంస్థలు కూడా ఈ ట్రస్ట్‌కు విరాళాలు అందించే వెసులుబాటు కల్పించింది.